Saturday 28 January 2012

SCIENTISTS


             నీల్స్ బోర్ 1885 అక్టోబర్ 7న క్రిష్టియన్ బోర్, ఎలెన్ ఎడ్లెర్ బోర్ దంపతులకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జన్మించాడు. 1903లో గణితం, వేదాంతం అభ్యసించడానికి కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. తర్వాత వేదాంతానికి బదులు భౌతికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ వద్ద పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు.  
 
             బోర్ 1913లో పరమాణు నిర్మాణానికి సంబంధించి ఒక నమూనాను ప్రతిపాదించాడు. దీన్ని వివరించడానికి మొదటిసారిగా 'క్వాంటం సిద్ధాంతాన్ని' ఉపయోగించాడు. 1918లో సైద్ధాంతిక భౌతికశాస్త్ర పరిశోధనశాలకు అధిపతి అయ్యాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 'లాస్ అలమోస్' పరిశోధనశాలలో అణుబాంబు నిర్మాణానికి ఇతర శాస్త్రజ్ఞులతో పాటు పరిశోధనలు చేశాడు. యుద్ధానంతరం కోపెన్‌హాగన్‌కి తిరిగొచ్చిన నీల్స్ బోర్ కేంద్రకశక్తిని శాంతియుతంగా ఉపయోగించడంపై ప్రచారం చేశాడు. CERN అనే ప్రయోగశాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు.
             బోర్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణానికి 1922లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి వచ్చింది. డేనిష్ ప్రభుత్వం 'ది ఆర్డర్ ఆఫ్ ది ఎలిఫెంట్' పురస్కారంతో గౌరవించింది. 1929లో ఫ్రాంక్లిన్ పతకాన్ని పొందాడు. 1997లో డేనిష్ జాతీయ బ్యాంక్ బోర్ చిత్రమున్న 500 క్రోనే కరెన్సీ నోటును విడుదల చేసింది. 1962 నవంబరు 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు. 

No comments: